మొంథా తుఫాన్ బాధితులను ఆదుకుంటాము- మంత్రి పొన్నం
మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా అంచనా వేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి రైతు నష్టాన్ని గుర్తించి, ఎవరు మిగలకుండా ప్రతి ఒక్కరినీ నివేదికలో చేర్చాలని ఆయన సూచించారు.మంత్రి తెలిపారు తుఫాన్ నష్టం అంచనాలను నిర్ణిత నమూనాలో తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని. పంచాయతీ రాజ్ మరియు ఆర్అండ్బీ శాఖలకు చెందిన రోడ్ల మరమ్మత్తుల అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, తాత్కాలిక మరియు శాశ్వత మరమ్మత్తులకు అవసరమైన వ్యయం అంచనాలతో కూడిన నివేదిక సమర్పించాలని సూచించారు.విద్యుత్ శాఖ పరిధిలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వివరాలను సేకరించి అందించాలని తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులు తమ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, నీటి వనరుల వివరాలు తక్షణం పంపాలని ఆదేశించారు.ఇక ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇళ్లు, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ వంటి నష్టాల సమగ్ర వివరాలు అందజేసి, బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని మంత్రి సూచించారు.