
జఫర్ఘడ్ మండలంలో విచ్చల విడిగా మొరం దందా
జఫర్ఘడ్ మండలంలో విచ్చల విడిగా మొరం దందా
మొరం అమ్ముకుంటున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి- సీపీఐ పార్టీ డిమాండ్
తెలుగు గళం జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని ముఖ్దుంతండా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న దేవాదుల వరదకాలువ దగ్గర మొరాన్ని అక్రమంగా తండా నుండి ఐనవోలు మండలానికి తరలించి కాంట్రాక్టర్ అమ్ముకుంటున్నాడాని సీపీఐ పార్టీ నియోజవర్గ కార్యదర్శి మండల కార్యదర్శి జువారి రమేష్ ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..వరద కాలువలో తీసిన మొరాన్ని అధికారుల అండదండలతో యథేచ్ఛగా అమ్ముకుంటున్నారాని ఆయన అన్నారు.టిప్పర్లతో రాత్రి,పగలు యదేశ్చగా నడుపుతున్నారని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.ఓవర్ లొడ్ తో టిప్పర్లను నడిపిస్తుంటే అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జఫర్ఘడ్ నుండి పాలకుర్తికి వెళ్లే రోడ్లు మొత్తం కుంగి పోయి శితిలావస్థకు చేరాయని ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారిందని ఆయన అన్నారు.మొరం అమ్ముకుంటున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఓవర్ లోడ్ తో వెళుతున్న టిప్పర్లను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపడతామని హేచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏస్ఎంసి కమిటీ చెర్మెన్ బానోత్ దుర్గాసింగ్ బానోత్ మోతిలాల్ బుచ్చన్న నాయక్ వర్జన్ నాయక్ బానోత్ రమేష్ బాస్కర్ నాయక్ దేవానాయక్ లు పాల్గొన్నారు.