మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి
Jangaonజనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లోభారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల కార్యవర్గ సభ్యుడు యాకుబ్ పాషా అధ్యక్షత జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పార్టీ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు.కేంద్రంలో ఉన్న బీజీపీ నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల పై చేస్తున్న ధమనకండను ఆపి రైతులకు ఇచ్చినా హామిలను నెరవేర్చాలని అన్నారు.మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరo మోడీ ప్రభుత్వం పై ఉన్నదని 2 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి రైతులను మోసం చేస్తావా ఖబడ్దార్ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాకపోతే రానున్న ఎన్నికల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమన్నారు.దేవుళ్ళపై ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలపై ఎందుకు లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో కేసీఆర్ కి పట్టిన గతే కేంద్రంలో ఉన్న మోడీ కి పడుతుoదన్నారు. మోడీ విధానాలపై యావత్తు భారత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి గుర్తుచుకోవలని అన్నారు. భారతదేశ సంపదను కొంతమంది కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి ఓట్ల రాజకీయం చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన మోడీ ప్రభుత్వానికి అదే తరహాలోనే బుద్ది చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయకార్యదర్శి ఆది సాయన్న రాష్ట్ర సమితి సభ్యురాలు పాతూరి సుగుణమ్మ మండల కార్యదర్శి జువారి రమేష్ సీనియర్ నాయకులు కూరపాటి చంద్రమౌళి రాడపాక.సత్తయ్య మంద బుచ్చయ్య,జాఫర్ పెండ్యాల సమ్మయ్య మదులాల్ నాయక్ వెంకటయ్య యాకయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు.