మోసపూరిత వాగ్దానాలకు పెట్టింది పేరు బీజేపీ
బీజేపీ ప్రజా, కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సీపీఎం జన చైతన్య రథయాత్రలో భాగంగా దివి: 28-03-2023 మంగళవారం రోజున జనగామ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య పాల్గొని మాట్లాడుతూ జనగామకు పారిశ్రామిక కారిడార్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మణిహారమైన టెక్సటైల్ పార్క్ మూసి, ఎంతోమంది కార్మికుల పొట్టకొట్టి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడే పరిస్థితిలో లేడన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేని మోడీ, సన్యాసిని అని చెప్పుకొని ప్రజల సొమ్ము ఖర్చుపెట్టి 467 కోట్లతో పెద్ద భవనం కట్టుకోవడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ గురించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ బీజేపీ నాయకుడు కూడా సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదన్నారు. మోసపూరిత వాగ్దానాలకు పెట్టింది పేరు బీజేపీ అని విమర్శించారు. అందుకే ఈ జన చైతన్య రథయాత్ర ద్వారా ప్రజలందరి దృష్టికి వాస్తవాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జనగామ జిల్లాలో జనగామ ప్రజానీకానికి కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశామని, జనగామ జిల్లా ప్రజానీకం మా యాత్రకు సాదరంగా స్వాగతం పలికారని వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు జన చైతన్య రథయాత్ర జనగామ నుంచి ప్రారంభమై ఆలేరు మీదుగా భువనగిరి బయలుదేరుతుందని అన్నారు. ఈ సందర్భంగా జనగామ ప్రజలందరికీ, పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. రేపు (మార్చి 29న) హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా జరిగే బహిరంగ సభలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు, టి. స్కైలాబ్ బాబు, p.ఆశయ్య, ఎం. ఆడవయ్య, జయలక్ష్మ, జగదీశ్, పార్టీ జనగామ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, మండల కార్యదర్శులు జి. మహేందర్, పార్టీ ఆఫిస్ ఇంచార్జి బిట్ల గణేష్, బి వెంకటమల్లయ్య, దడిగె సందీప్, దూసరి నాగరాజు, టి దేవదానం, కళ్యాణం లింగం, బాలు, బ్లెస్సింగ్టన్, ఎం. బీరయ్య, మీట్యా నాయక్, పల్లెర్ల శంకర్, ఎ. సురేష్, టి. గణేష్. కె. కళ్యాణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.