
telugu galam news e69news local news daily news today news
( భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య )DYFI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఇల్లందు సీఐ కరుణాకర్ గారు ఆవిష్కరించారు,
సీఐ గారిని డివైఎఫ్ఐ ప్రతినిధి బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు సిఐ కర్ణాకర్ గారు మాట్లాడుతూ విద్యా,వైద్యం కోసం, మంచి ప్రవర్తన కోసం,సమాజ మార్పు కోసం యువకులు ఎలాంటి పాత్ర పోషించాలో అందుకు తగ్గ యువకుల్ని తయారు చేసే దానికోసం డివైఎఫ్ఐ ముఖ్యపాత్ర పోషించాలని, దేశ స్వాతంత్రం కోసం సమాజ మార్పు కోసం పాటుపడిన మహనీయుల్ని స్మరించుకుంటూ ముద్రించిన క్యాలెండర్ చాలా బాగుందని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బయ్యా అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.