
telugu galam news e69news local news daily news today news
ఆదివారం రోజున ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భానోత్ రవిచందర్ అధ్యక్షతన జరిగిన యువజన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ భారత దేశ బావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ జొడో యాత్రకి మద్దతుగా నిలుద్దాం, ఆర్దికంగా సహకరిద్దాం అనే నినదన్నిచ్చారు. అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఎంతో కష్ట పడ్డారు నా విజయానికి కొండంత బలంగా యూత్ కాంగ్రెస్ నాయకులు రాత్రి పగలు తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం అని..అంతే కాకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఎప్పుడు మరచి పోనని హామీ ఇస్తున్నాను చాలా రోజుల తరువాత యూత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంత పెద్ద సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దనసరి సూర్య, రాష్ట్ర సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు