
కోదాడ మండల పరిధిలోని గుడిబండ మెయిన్ రోడ్డు నందు శుక్రవారం కాపుగల్లు గ్రామానికి చెందిన మీగడ సురేష్ నిర్వహిస్తున్న శ్రీ సాయి టిఫిన్ సెంటర్ ని ప్రారంభించిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని సొంత వ్యాపారం నిర్వహించుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలని వ్యాపార ధోరణితో కాకుండా సామాజిక భాద్యత కలిగి ఉంటూ నాణ్యమైన రుచికరమైన విందు అందించాలని వ్యాపారంలో దినదినాభివృద్ది సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కూచిపూడి సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జిల్లా బోసుబాబు,ప్రధాన కార్యదర్శి సోమపంగు అంబేద్కర్,వార్డు సభ్యులు సురేష్, శేషు,బిఆర్ ఎస్ నాయకులు భిక్షం, లచ్చిరెడ్డి,పుల్లారావు, కృష్ణ, ఓర్సు గోపి, టిఫిన్ సెంటర్ నిర్వాహకులు మీగడ సురేష్,వంట మాస్టర్ నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.