
యూపీలో న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోదాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస నాయుడు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని కోర్టు ఆవరణలో ఉత్తరప్రదేశ్ లో వరుసగా న్యాయవాదులపై కొందరు దుండగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చాలా దురదృష్టకరం అని అన్నారు. న్యాయవాదులపై రోజురోజుకూ పెరుగుతున్న దాడుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శరత్ బాబు, ట్రెజరర్ పాశా, సీనియర్ న్యాయవాదులు వేజేల్లా రంగారావు, గత నరసింహారావు, బాల నరసయ్య, మంద వెంకటేశ్వర్లు ఉయ్యాల నరసయ్య,రియాజ్,కోదండపాణి, నాగరాజు, హేమలత, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు……..