
యూరియా కొరతతో రైతుల గోస
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లో అర్ధరాత్రి నుండి యూరియా కోసం క్యూలైన్లు కట్టిన రైతులు సమయానికి రాని అధికారులు సరిపడలేని యూరియా ఫోన్ చేసి తమ బాధలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలిపారు.
వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల గోస విని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండలం కేంద్రంలో ని కల్లెడ ప్రాధమిక వ్యవసాయ సహాకార సంఘ కేంద్రంలో కి వెళ్లి రైతుల దీన స్థితి కి చలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేసి తక్షణమే యూరియా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్న వారికి 1 బస్తా ఇచ్చి మాకు మభ్య పెడుతున్నారు అని తెలిపారు.
ప్రజాపాలన అని ప్రజలని ఈ ప్రభుత్వం ప్రజలని రాక్షసులు గా వేదిస్తున్నారని కెసిఆర్ గారి హయాంలో రాజులుగా బ్రతికిన రైతులు ఈ దూర్మార్గపాలనలో రైతులు ఎరువులకోసం అధికారుల కాళ్లు పట్టుకుంటే స్థితికి వచ్చారు. ఒకప్పుడు తెలంగాణ లో రైతు రాజ్యంగా ఒక వెలుగు వెలగగా నేడు రాక్షస రాజ్యం నడుస్తుంది. ఎరువుల సరఫరా లో అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది.
నాడు కెసిఆర్ గారి హయాంలో 6 నెలల ముందే ఎరువులు నిలువ చేసి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసే వారు కానీ ఈ ప్రభుత్వానికి ముందు చూపులేక రైతులను ఆగం చేస్తున్నారు అని ఈ సందర్బంగ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.