
యెస్ ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో రైతు సదస్సు
యెస్ ఆర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ కళాశాలలో గురువారం రైతు సదస్సు నిర్వహించబడింది.తొమ్మిది గ్రామాల నుండి సుమారు 150 మంది రైతులు ఇందులో పాల్గొన్నారు.కార్యక్రమానికి కళాశాల డీన్ డాక్టర్ జి.భూపాల్ రాజ్ అధ్యక్షత వహించగా,రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్చన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో జరుగుతున్న కొత్త ఆవిష్కరణలను రైతులు అవలంబించాలని సూచించారు.డీన్ డాక్టర్ భూపాల్ రాజ్ రైతులు నేల పరీక్షలు చేసి,అవసరమైనంత మేరకే ఎరువులు వాడాలని, ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు.సదస్సు సందర్భంగా రైతుల మట్టిని పరీక్షించి మట్టి ఆరోగ్య కార్డును అందజేసి, పండ్ల మొక్కలను కూడా పంపిణీ చేశారు. రైతుల ప్రశ్నలకు అధ్యాపక నిపుణులు సమగ్ర సమాధానాలు ఇచ్చారు.కార్యక్రమం విస్తరణ శాఖ కోఆర్డినేటర్ శ్రీకర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. డాక్టర్ బి. సోమరాజు, డాక్టర్ రాథోడ్ లాల్, డాక్టర్ వైభవ్ పండిట్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.అదేవిధంగా విద్యార్థులు రూపొందించిన ఒక ప్రత్యేక యాప్ను రైతులకు పరిచయం చేశారు.చివరగా పీహెచ్.డి విద్యార్థులు విష్ణు ప్రియ,అనిల్ వందన సమర్పణ చేశారు.కార్పొరేటర్ జలగం రంజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.