
ఆత్మగౌరవ భవనంలో ఒక ఫ్లోర్ ని కేటాయించడం వలన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే మన విద్యార్థులకు, నిరుద్యోగులకు కొద్ది మందికి మాత్రమే అవకాశం కల్పించిన వాల్లమవుతాం.
అదే ప్రత్యేకంగా నిర్మిస్తే అందరికీ అవకాశం కల్పించినట్లవుతుందని, మనకు కేటాయించిన స్థలంలోఆత్మగౌరవ భవనంతో పాటు విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించాలని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య గారిని కలిసి విన్నవించడం జరిగింది దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి విద్యార్థులకు హాస్టల్ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది… విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని హంగులతో కూడిన వసతి గృహాన్ని నిర్మిద్దామని,దానికి ప్రభుత్వం నుండి వచ్చే నిదులే కాకుండా MLC నిధుల నుండి కూడా బడ్జెట్ ని కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రజక విద్యార్థి సంఘం, చాకలి ఐలమ్మ సంఘం హర్శం వ్యక్తం చేస్తూ తెలంగాణ రజక విద్యార్థి,నిరుద్యోగుల తరఫున MLC గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం