
airtwf రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. అజయబాబు
ఈ రోజు జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక రవాణా సమ్మె లో భాగంగా హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్క్ వరకు Airtwf -Citu హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.ఈ ర్యాలీ లో airtwf రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. అజయబాబు పాల్గొని మాట్లాడారు.. అజయ్ బాబు మాట్లాడుతూ’
రవాణా రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటింది. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్హు ల నిత్యం తాను వత్తిడికి గురౌతు కూడా సమాజానికి డ్రైవర్లు తమ సేవల్ని అందిస్తున్నారు.అయినా గానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని పట్టించుకోవడం లేదు.ప్రభుత్వాల నిర్లక్ష్యంవలన రోడ్డు రవాణా రంగ కార్మికులకు ఇప్పటివరకు సామాజిక భద్రత చట్టం (సంక్షేమ బోర్డు) కేంద్రం లో, రాష్ట్రంలో ఏర్పాటు చేయబడలేదు.కేంద్ర ప్రభుత్వo మనల్ని ఉద్దరించకపోగా, మన జేబులు గుల్ల చేసేందుకు మోటార్ వాహన చట్టం 2019ని తీసుకువచ్చింది. ఈ చట్టంలో “సెక్షన్ 93లో అగ్రిగేటర్” అనే పదం చేర్చి చిన్న చిన్న వాహనదారులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సెక్షన్‌ను చేర్చింది. ఇప్పటికే రవాణా రంగాన్ని ఓలా / ఊబర్ / ర్యాపిడో / పోర్టర్ | మొదలైన భారీ కార్పొరేట్ కంపెనీల జేబులలో ఖజానా నింపి, కార్మికుల కడుపులు కొడుతుందీ బిజెపి ప్రభుత్వం.
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)ను బ్రిటిష్ వారు చేశారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం | భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) చట్టాన్ని తీసుకొచ్చింది. ఐపిసి సెక్షన్ 304ఎ ప్రకారం | డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్‌కు రెండేళ్ళ జైలు శిక్ష విధించేవారు. ఈ చట్టం స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లో సెక్షన్ 106(1) & (2) క్లాజ్ ప్రకారం, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే డ్రైవర్‌కు ఐదేళ్ళు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ప్రమాదానికి కారణమైన డ్రైవరు ప్రమాద | స్థలం నుండి పారిపోతే జైలు శిక్ష పదేళ్ళతో పాటు జరిమానా రూ.7 లక్షలకు పెంచబడుతుంది.
కార్మికులకు రక్షణ గా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో యాజమాన్యాలకు అనుకూలమైన మార్పులుచేసి వాటిని 4 లేబర్ కోడ్స్ గా మనపై రుద్ద బోతుంది.
అందుకే ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ సమ్మె తర్వాత నైనా కేంద్రప్రభుత్వం కార్మిక సంఘాల తో చర్చించి డిమాండ్స్ ని పరిష్కరించాలని,లేనట్లయితే మీ ప్రభుత్వం కు రాబోయే కాలంలో కార్మికవర్గం భవిష్యత్తు లేకుండా చేస్తుoదని హెచ్చరించారు.ఈ దేశవ్యాప్త సమ్మెలో హైదరాబాద్ నగరంలోని రవాణా రంగ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.