
రాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం న్యూస్.
పాఠశాలలోని విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హీరాలాల్ మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో పాలుపంచుకొని బతకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు.తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదని బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ…ఈ పండుగ భాద్రపద మాసంలో పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతకమ్మను అలంకరించి ఆటపాటలతో ఆడుకుంటారని తెలిపారు.చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు పూల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నేడు బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని పంటలు బాగా పండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రవాసభారతీయులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని ప్రకృతితో మమేకమైన ఈ పండుగ అందరూ ఉత్సాహంగా నిర్వహించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం గుర్రం వెంకన్న గౌడ్, గణేష్,రాజేశ్వరి,క్రాంతి,శ్రీధర్, సిఅర్పి దోమల సత్య శ్రీనివాస్ గౌడ్ విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు, మంజుల తదితరులు పాల్గొన్నారు.