రాజయ్య ఆధ్వర్యంలో తెరాస పార్టీలో భారీ చేరికలు
Jangaonతేదీ: 04.12.2022 ,
హన్మకొండ.
ఈ రోజు…హన్మకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు రఘునాథపల్లి మండలం , నిడిగొండ గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ & టీడీపీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వారాల రమేష్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన 30 మంది నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయడానికి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరిన వారిని హృదయపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
నూతనంగా పార్టీలో జాయిన్ అయిన వారిని వారి స్థాయికి తగ్గకుండా టిఆర్ఎస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించడమే కాకుండా కూనూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వారాల రమేష్ ,మండల సమన్వయకర్త మడ్లపల్లి సునీత-రాధాకృష్ణ , మండల ప్రధాన కార్యదర్శి మూసిపట్ల విజయ్ , నిడిగొండ గ్రామాశాఖ అధ్యక్షులు తిప్పారపు బాబురావు ,నియోజకవర్గ సోషల్ మీడియా మహిళ ఇంచార్జ్ తిప్పారపు రమ్య , కంచనపల్లి ఎంపీటీసీ కేమిడి రమ్య ,మండల నాయకులు బొల్లపల్లి వెంకటస్వామి మరియు మండల కార్యదర్శి మాల రాజు మరియు యూత్ నాయకులు శ్రీకాంత్ గార్లు తదితరులు పాల్గొన్నారు