
రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు
స్టేషన్ ఘనపూర్‌లోని హనుమాన్ వాస్తు జ్యోతిషాలయం లో శరన్నవ రాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.తొమ్మిది రోజుల పాటు దుర్గామాత వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చింది.మొదటి రోజు బాలా త్రిపురసుందరి దేవి,రెండవ రోజు గాయత్రి మాత,మూడవ రోజు అన్నపూర్ణాదేవి,నాలుగవ రోజు కాత్యాయనీ దేవి,ఐదవ రోజు మహాలక్ష్మి దేవి,ఆరవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి,ఏడవ రోజు మహా చండీ దేవి,ఎనిమిదవ రోజు సరస్వతి దేవి,తొమ్మిదవ రోజు దుర్గామాతగా,పదవ రోజు మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు నిర్వహించారు.ప్రతిరోజూ కుంకుమ పూజలు,అభిషేకాలు,హోమాది కార్యక్రమాలు నిర్వహించగా,పదవ రోజు సప్తశతి చండీ హోమం అనంతరం పూర్ణాహుతి జరిగింది.చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిచ్చి భక్తులను కరుణించారు.గురువారం పూజ అనంతరం భజనలు,కోలాటాలు,మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి, ఘనపూర్ రిజర్వాయర్ వద్ద అమ్మవారికి గంగాస్నానం చేయించారు.అనంతరం జమ్మి పూజతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.ఈ సందర్భంగా ప్రధాన పూజారి వాస్తు జ్యోతిష రత్న,నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ నర్సింగోజు బ్రహ్మచార్యులు,రాణి,శివ సాత్విక్,సృజన్ కుమార్,ఎస్సైలు వినయ్,రాజేష్,రమేష్,కొలిపాక సతీష్,సునీత,వర్షిణి,గట్టు సురేందర్,సౌమ్య,రజిని,కుమార్,సాయి చరణ్ రెడ్డి,ఉమ,సుజాత,సుధాకర్,వెంకట్ సాయిపల్లవి,సతీష్‌రెడ్డి,సరిత,ప్రభాకర్,కృష్ణ,నితేజ్,చరణ్,రవీందర్,దినేష్,దివ్య,రమ,స్వరూప,భార్గవి,పృద్వి,శ్రీలత,సుమలత,శైలజ,నవనీత్,మహేష్,లక్ష్మి,శంకర్,శ్రీవాణి,శ్రీకాంత్,కోమల వెంకట్ రెడ్డి,సంగీత,రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.