
పాలడుగు నాగార్జున kvps రాష్ట్ర ఉపాధ్యక్షులు
- పాలడుగు నాగార్జున kvps రాష్ట్ర ఉపాధ్యక్షులు
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకునేందుకు దరఖాస్తు తేదీని ఈ నెల చివరివరకు పొడిగించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున నల్గొండ దొడ్డికొమురయ్య భావనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శని అది సోమవారాలు సెలవులు కావడం, సైట్ ఓపెన్ కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని,అప్లై చేసిన దరఖాస్తులు సైతం సెలవు కావడంతో సమర్పిచలేకపోయారని, మరియు అనేక రోజులుగాకులం ఆదాయ సర్టిఫికెట్ కొరకు కార్యాలయం చుట్టూ తిరిగిన సెలవులు కారణంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడంకష్టం గా వున్నదని, దాని కోసం ఎదురు చూస్తున్నా సైట్ మొరాయించటం సర్వర్ బిజీ వల్ల అతి కొద్ది మందికి మాత్రమే అవకాశందొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సేవ, మీ సేవ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు పడి కాపులు కాస్తున్నారని అన్నారు. ఏవైనా సర్టిఫికెట్ లేకపోయినా తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చి అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. రెవెన్యూ అధికారుల సైతం కుల ఆదాయ సర్టిఫికెట్ లని త్వరగా దరఖాస్తుదారులకు అందించాలని అన్నారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 14 తో ముగుస్తుండడంతో ఆశవహులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రతి ఒకరు అప్లై చేస్తున్నారని ఎంత మందికి ఇస్తారు అనే క్లారిటీ లేదన్నారు. అర్హత వున్నా ప్రతి ఒకరికి ఇవ్వకుంటే ఆందోళన తప్పదని హేచరించారు. ప్రభుత్వం స్పందించి దరఖాస్తు తేదీని మరొకసారి పొడిగించాలని తెలిపారు. ఈ పథకం అమలులో దళారీలు,రాజకీయ పార్టీల నేతలకు అవకాశం లేకుండా అర్హులైన పేదలు అందరికీ పారదర్శకంగా అందించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశములో kvps జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, పోలె సత్యనారాయణ పాల్గొన్నారు.