
రాజీవ్ యూత్ స్కీమ్‌లో జర్నలిస్టులకు చోటు కల్పించాలి

ఈ69న్యూస్ వరంగల్, ఏప్రిల్ 7
రాజీవ్ యూత్ డెవలప్మెంట్ స్కీమ్‌లో జర్నలిస్టులను చేర్చాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) కోరింది.ఈ మేరకు కలెక్టర్ సత్య శారదను కలిసిన WJI నేతలు పథకంలో పేద,మధ్య తరగతి జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తించిన కలెక్టర్,అర్హులకు స్కీమ్ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.