
telugu galam news e69news local news daily news today news
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
మణుగూరు ఓసి వల్ల తీవ్ర కాలుష్యం బారిన పడ్డ రాజుపేట గ్రామాన్ని పునరావాస గ్రామంగా ప్రకటించి ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సోమవారం నాడు రాజుపేట గ్రామంలో ” నిర్వాసితుల సదస్సు ” సత్రపల్లి సాంబశివరావు అద్యక్షతన జరిగింది, ఈ సదస్సులో వారు పాల్గొని మాట్లాడుతూ మణుగూరు ఓపెన్ కాస్ట్ వల్ల తీవ్రంగా కాలుష్యం బారిన పడిన గ్రామం రాజుపేట అన్నారు, అనేక రకాల ఉదరకోశ, శ్వాసకోశ సంబంధమైన జబ్బులతో ప్రజలు బాదపడుతున్నారని అన్నారు, రాజుపేట గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సింగరేణి యాజమాన్యాన్ని వారు కోరారు, మణుగూరు ఓసి ప్రారంభం లో ప్రాజెక్ట్ వల్ల ఈ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు, ఇప్పటికైనా వెంటనే పునరావాసం ప్రకటించి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు,ప్రజలందరిని ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన కుటుంబాలు గా గుర్తించి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని అన్నారు, ఈ డిమాండ్ల సాధనకు భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించడం కోసం పోరాట కమిటీ ని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, కొడిశాల రాములు, సత్రపల్లి సాంబశివరావు,సంఘం మండల అద్యక్ష, కార్యదర్శులు పిట్టల నాగమణి, బొల్లం రాజు, సీఐటీయూ నాయకులు నర్సింహారావు, నిర్వాసితులు ప్రభాకర్, మున్నా,సతీష్, భూక్యా కవిత,వెంకట్రాములు,మణికంటి సీతమ్మ,భావ్ సింగ్, పవన్, మల్లీశ్వరి, వెంకన్న, సౌందర్య,పూజిత, నాగార్జున, రామకృష్ణ, భాస్కర్ రావు,వసంత, లావణ్య,లేత, శాంతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.