రాజ్యాంగం కల్పించిన హక్కు మత స్వేచ్ఛ-
Uncategorizedజాఫర్గడ్ మండల పాస్టర్ల సంఘం అధ్యక్షుడు పాస్టర్ తాళ్లపల్లి కొర్నేల్ జన్వాడ ఘటనకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ లో క్రైస్తవుల శాంతి ర్యాలీ. తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి ఘన్పూర్ బస్టాండు వద్దగల అంబేద్కర్ విగ్రహం వరకు ఏడు మండలాల పరిధిలో ఉన్న పాస్టర్లు క్రైస్తవ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై శాంతియుత ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జాఫర్గడ్ మండల పాస్టర్ల సంఘం అధ్యక్షుడు పాస్టర్ తాళ్లపల్లి. కొర్నేల్ మాట్లాడుతూ..జన్వాడలో జరిగిన ఘటన ఇది చాలా విచారకరమని ఒక చర్చి సంఘం సభ్యులు శాంతియుతంగా భక్తితో ప్రార్థనలు నిర్వహించుకుంటుంటే అక్కడికి కొంత మంది అసాంఘిక శక్తులు వెళ్లి వారిపై అమానుషంగా దాడి చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధమని చట్టరీత్యా శిక్షించదగిన విషయం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.రాజ్యాంగానికి లోబడి మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మత స్వేచ్ఛను అనుభవిస్తుంటే మాపై దాడి చేయడం తగదని దీనికి సంబంధించిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు అనంతరం శాంతియుత ర్యాలీకి మద్దతుగా బీ.ఎస్.పి జిల్లా ఇన్చార్జి తాళ్లపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ జన్వాడ ఘటన అనేది ఒకటి చీకటి దినంగా భావిస్తున్నామని క్రైస్తవుల పైన జరిగిన దాడికి మా పార్టీ తరఫున సంఘీభావం వ్యక్తం చేస్తున్నాము అన్నారు ఇదే కాకుండా మణిపూర్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది ఇప్పటికీ మణిపూర్ ఘటన నుండి తేరుకోక ముందు మరో ఘటన జరగడం చాలా బాధాకరం దీనికి మద్దతుగా మా రాష్ట్ర నాయకుడు బీ.ఎస్.పి పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరసనను తెలియజేయడం జరిగిందన్నారు క్రైస్తవులకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జీవించే హక్కు లేదా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదా వారికి మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు లేదా అని బహుజన సమాజ్ వాది పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన కులం మారాల్సిన అవసరం లేదని దీనిని ఒక క్రైస్తవులకు మాత్రమే ఆపాదించి క్రైస్తవులని అణచివేయాలనే ఒక నియంతృత్వ ధోరణితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు వారు కళ్ళు తెరిచి ఈ దేశ పౌరులను వారి యొక్క హక్కులను కాపాడాలని జన్వాడ ఘటనలోని దోషులని కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ క్రిస్టియన్ ఫెలోషిప్ మండల అధ్యక్షుడు జాన్ బన్నీ,జఫర్గడ్ ఫెలోషిప్ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి.కోర్నేలు,వేలేరు మండల ఫెలోషిప్ అధ్యక్షుడు కుమార్,చిల్పుర్ మండల ఫెలోషిప్ అధ్యక్షుడు సీమోన్,రఘునాథపల్లి మండల ఫెలోషిప్ అధ్యక్షుడు జయరాజ్,ధర్మసాగర్ మండల ఫెలోషిప్ అధ్యక్షుడు మోషే,లింగాల గణపురం మండల ఫెలోషిప్ అధ్యక్షుడు కాలేబు,మరియు నియోజకవర్గ మండలాల పాస్టర్లు,తదితరులు పాల్గొన్నారు.