
telugu galam news e69news local news daily news today news
పల్లె పల్లెనా నీరాజనం పలుకుతున్న భక్తులు ఎందరో
అయోధ్య రాముడే మా పల్లెకు వచ్చాడు అని మురిసి పోయే పల్లెలెన్నో
భద్రాచలం :ఆయన ఓ సాధారణ పూజారి కానీ పల్లె జనం గుండెల్లో నడయాడుతున్న శ్రీరామచంద్రుడు. ఆయన అడుగు పెడితే చాలని మురిసిపోయే పల్లెలెన్నో, ఎందుకంటే మన్యంలో ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చి పెద్ద కొడుకుగా అండగా నిలిచి సేవలందిస్తున్న మహాత్ముడే ఈ చైతన్య స్వామి. రామ జన్మభూమి అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా గ్రామాలన్నీ దీపాల కాంతులతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రతి ఇల్లు నందనవనంగా పండుగ జరుపుకుంటున్న వేళ ఓ హరిజనపల్లె మాత్రం తమ గురువు గారే తమకు రామచంద్రుడని గురువుగారి పేరుతో దీపాలు వెలిగించి గురుభక్తిని చాటుకున్నారు. నిజంగా ఒక వ్యక్తిని ఇలా ఆరాధించడం అంటే వారు చేసిన సేవలు ఎటువంటివో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా గిరిపుత్రులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కన్నతల్లిలా మమ్మల్ని ఆదరించిన మహాత్ముడే ఈ చైతన్య స్వామి అని, గత సంవత్సరం వరదలు వచ్చి కట్టుబట్టలతో వచ్చి గుట్టల్లో ఆహారం నీళ్లు కూడా లేక వృద్ధులు చంటి బిడ్డలతో గోస పడుతున్న మాకు అర్థ రాత్రిళ్ళు సైతం నిండు గోదావరి లో ప్రాణాలు సైతం తెగించి పడవలలో వచ్చి అన్నం పెట్టిన అన్నపూర్ణేశ్వరి మా గురువుగారిని మా మన్యం బిడ్డలకు నిజమైన రామచంద్రుడు మా గురువుగారేనని వారు అందించిన స్ఫూర్తితో ఎంతోమంది విద్యాదికులుగా, ఉద్యోగులుగా ఉన్నారని,అలానే వరదల సమయంలో పంటలన్నీ కోల్పోయిన ఎంతో మంది పేద రైతులను చేరదీసి అండగా నిలిచిన యోధుడు మా గురువుగారిని అంతేకాకుండా మమ్మల్ని సన్మార్గం లో నడిపిస్తూ ఆదరిస్తున్న గురువుగారు మా హరిజన గిరిజన పల్లెలో అడుగుపెట్టడం మా పూర్వజన్మ సుకృతం అని అన్నారు, ఆనాడు రామచంద్రుడు శబరమ్మను వెతుక్కుంటూ వచ్చినట్లుగా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి సేవలందిస్తున్న మా గురువుగారి పై ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మాలాంటి పేద బిడ్డలకు చేయూతనిచ్చే శక్తిసామర్థ్యాలను ఆ అయోధ్య రాముడు వారికి ప్రసాదించాలని చెమ్మగిల్లుతున్న కళ్ళతో చెప్పడం నిజంగా ఆశ్చర్యమే,ఇటువంటి సేవలుచేసే మహాత్ములకు మనం కూడా సహకారం అందిద్దాం వారు చేస్తున్న సేవల్లో మనంకూడా భాగస్వామ్యులమవుదాం.