
రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఒక ప్రకటన చేయలేదు
వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబానికి 20 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలి…
ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అవగాహన రాహిత్యమే నేడు ఈ పరిస్థితికి ప్రధాన కారణం…
వరద భీభత్సంతో ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను, వ్యాపారస్తులను ఎంత నష్టం జరిగిందో అధికారులచే అంచనా వేసి వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్…
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో నాయిని…
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో హన్మకొండ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
బిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అనుచరులు నాలలు, చెరువులు, ఎఫ్.టి.ఎల్ భుములపై అక్రమంగా కట్టడాలు, భూకబ్జాలు చేయడంవల్లనే కదా ఈ రోజు ఈ దుస్తితికి కారణం.
మీరు ఎందుకు భూకబ్జాలు చేసిన వారిపై అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటేనే దీనిలో మీకు భాగం ఉందని అర్థమవుతుంది.
వరదలు రావడం పూర్తిగా మానవ తప్పిదo వల్లనే జరిగింది.
భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ మూడు రోజులు ముందుగానే ముందస్తుగా హెచ్చరించినా ఎం.ఎల్.ఏ. అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు నగర ప్రజలకు ఈ దుస్థితి పట్టింది.
ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అవగాహన రాహిత్యమo నేడు ఈ పరిస్థితికి ప్రధాన కారణమన్నారు.
నాలాలపై అక్రమ కట్టడాలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వర్షాకాలంలో కాలనీలు మునుగుతున్నాయి.
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయడంలో స్థానిక ఎం.ఎల్. ఏ & బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.
పాలకుల నిర్లక్ష్యం, అధికారులు చేతగాని తనంతోనే బాధితులకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ప్రతి సంవత్సరం ఇదే తంతు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవు. నగర అభివృధి పై ఒక పక్కా ప్రణాళిక లేని ప్రభుత్వం.
కేంద్రం నుండి సంవత్సరం నికి 300 కోట్లు నిధులు వస్తాయి, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించి వరంగల్ నగరాన్నిబ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నాకెసిఆర్ మాటలు నీటి మూటలుగానే ఉన్నాయిని.
నిధులు ఉన్న కూడా నిధులను వినియోగించుకొని దద్దమ్మలు ఈ టిఆర్ఎస్ నాయకులు.
అండర్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగడం, అసంపూర్తిగా ఉండటం నగర వాసులకు శాపంగా మారింది.
ఏళ్లు గడుస్తున్నా.. పనుల్లో జాప్యం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించు కోకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ రోజు 100 ఫీట్ రోడ్ లో నిర్మిస్తున్న డ్రైనేజి వల్లనే హన్మకొండ నగరం నీట మునిగింది.
కాంట్రాక్టర్ ఎన్ని రోజులు చేస్తాడు ఆపనిని అసలు కాంట్రాక్టర్ కు అవగాహనా ఉందా ? పక్కా ప్రణాళిక ఉందా?
బాధితుల గోడు వింటుంటే గుండె తరుక్కు పోతోందని మనోవేదనకు గురయ్యారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారులు చేతగాని తనంతోనే బాధితులకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు..
బిఆర్ఎస్ పార్టీ నాయకులు జలదిగ్బంధమయిన కాలనీలో ఉన్న ప్రజలను సహాయం చేసింది లేదు కనీసం పరమార్శించింది లేదు.
బిఆర్ఎస్ నాయకులు అధికారులు వచ్చి పర్య వేక్షించుడు కాదు, శాశ్వత పరిష్కారం ఎందుకు చేయడం లేదు.
ఫోటో కు ఫోజ్ ఇచ్చి పత్రికల్లో వేయించుకోవడానిక మీరు దీనికి తప్ప ప్రజల బాగోగుల కష్టాలు కన్నీళ్లు కనిపిస్తాయా మీకు ?
నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జలదిగ్బండంలో చిక్కుకున్న కాలనీలో ప్రజలకు భోజనాలు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది.
గత ఏడాది వరదలు వచ్చినప్పుడు నగరంకు విచ్చేసిన కేటీఆర్ రాబోయే వర్షాకాలంలోపు ఏ ఒక్క కాలనీ కూడా వరదల ప్రభావానికి గురి కాకుండా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఇచ్చిన హామీ విస్మరించిండు కాబట్టి కేటిఆర్ ఏ మొఖం పెట్టుకొని పర్మర్శించటానికి వస్తాడు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వరద ముంపు సమయంలో వరద బాదితులకు 10 వేల ఆర్ధిక సహాయం చేస్తామని చెప్పిండు గ్రేటర్ ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు దాటింది కాని ఇంత వరకు వరద బాధితులకు 10 వేల ఆర్ధిక సహాయం అందలేదు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పోయిన వర్షాకాలం వర్షానికి నీటం మునిగిన కాలనీలా కన్నా ఈ ఏడాది ఇంకా కాలనీల సంఖ్య పెరిగింది గాని తగ్గలేదు..
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ భాస్కర్ గారు హయంలో వరంగల్ ఎలా మునిగిందో ఒక్కసారి చూడు, తూతూ మంత్రంగా ఏ పూట కా పూట మాటలు చెప్పి తప్పించుకొని ప్రజలను ఇన్నాళ్లు మోసం చేశావు.
వరంగల్ పశ్చిమలో నువ్వు ఎం అభివృద్ధి చేసావో ఈ వరదలే నిదర్శనం.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఏం సాధించిందని ఆత్మీయ సమ్మేళనాలు చేసింది.
ప్రభుత్వం ప్రజల యొక్క కష్టాలను అర్థం చేసుకొని కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపెట్టి వాళ్లకు జరిగిన నష్టానికి అధికారులచే అంచనా వేయించి నష్టపరిహారం చెల్లించాలని, లేని యెడల రేపు సాయంత్రం వరకు వేచి చూసి నష్ట పరిహారం చెల్లించక పోతే ఎం.ఎల్.ఏ. ఇంటి ముందు చావు డప్పు వాయిస్తామని, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ను ముట్టడిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, నేషనల్ ఎస్.సి. డిపార్టుమెంటు కో-ఆర్డినేటర్ డాక్టర్ పి. అనిల్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామ కృష్ణ, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తౌటం రవీందర్, నల్ల సత్యనారాయణ, బండారి జనార్ధన్ గౌడ్, దేశిని ఐలయ్య, ఇప్ప శ్రీకాంత్, బంక సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.