
2023 – 2024 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్ సవరించి రజక వృత్తిదాలకు 1000 కోట్లు కేటాయించాలని తెలంగాణ రజకుల సంఘం జూబ్లీహిల్స్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు జోన్ కమిటీ ఆధ్వర్యంలో మధుర నగర్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జోన్ అధ్యక్షులు రాపర్తి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 59 కోట్లే ఈ బడ్జెట్లో కేటాయించిందని ఇవి ఉచిత విద్యుత్‌కు సరిపోవని మరియు రజకుల అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించి ప్రతి రజక కుటుంబానికి 5 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రజక విద్యార్థులకు విద్య కోసం నిధులు కేటాయించాలని రజకుల రక్షణ చట్టం చేయాలి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మురళి ,రాజశేఖర్, వెంకటేష్ ,రాజు, నాగరాజు ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.