రాష్ట్ర బడ్జెట్లో దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి
Sangareddyప్రణయ్ హత్యకేసులో న్యాయమే గెలిచింది
కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కండి
కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
మార్చి 19న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని చేవెళ్ల ఎస్సి ఎస్టీ డిక్లరేషన్ అమలు కోసం బడ్జెట్ సరిపడే నిధులు కేటాయించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గురువారం నాడు సంగారెడ్డి కేవల్ కిషన్ భవన్ లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కెవిపిఎస్) సంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ అధ్యక్షతన జరిగింది…
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల ఎస్సీ
ఎస్టీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా దళిత నిరుద్యోగులకు 12లక్షల రూపాయలతో అంబేద్కర్ అభయహస్తంఇస్తామని ప్రకటించిందని ,దానికి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు ఏటా 750 కోట్ల రూపాయలు అంబేద్కర్ అభయస్థం స్కీముకు ఇస్తామన్న మాట నిలబెట్టుకో లేదన్నారు. దళితుల కోసం మూడు కార్పొరేషన్లు నియమిస్తామన్న మాట నీటిమూటలాగా మారిందన్నారు కుల దురహంకార హత్యలు పెట్రేగిపోతున్నాయని కులాంతర వివాహితుల రక్షణ చట్టం కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేయాలన్నారు ఇటీవల నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రణయ్ హత్య కేసులో కుల దురహంకారులకు చంప చల్లుమనే తీర్పు వచ్చిందన్నారు తీర్పు అట్టడుగు వర్గాలకు ఒక ధైర్యాన్ని భరోసాను ఇస్తుందన్నారు తీర్పు పట్ల కెవిపిఎస్ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు
ఏప్రిల్ నెలలో మహనీయుల మాసంగా ప్రకటించుకుని పూలే అంబేద్కర్ జన జాతర నిర్వహించనున్నట్లుచెప్పారు
కుల వివక్ష అంటరానితనం పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు చేపట్టనున్నట్లు చెప్పారు రాష్ట్రంలో నేటికీ హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి దేవాలయ ప్రవేశం లేకపోవడం కొన్ని గ్రామాలలో బతుకమ్మ ఆడనీయకపోవటం రచ్చబండల మీద కూర్చొనియ్యకపోవడం పట్టణ ప్రాంతాలలో దళితులకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం వంటి వివక్ష రూపాలు కొనసాగుతున్నాయని చెప్పారు ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలన్నారు
పూలే అంబేద్కర్ జన జాతరలు ఏప్రిల్ నెల మొత్తం నిర్వహిస్తామన్నారు
కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ*జిల్లాల అనేక నేటికీ కులవక్ష కొనసాగుతుందన్నారు దేవాలయ ప్రవేశం లేని గ్రామాలున్నాయని చెప్పారు దళితుల పట్ల చిన్నచూపు చూస్తు అవమాణిస్తున్నారని చెప్పారు సంగారెడ్డి సిటీలో సైతం దళితులకు ఇండ్లు అద్దకు ఇవ్వడం లేదని వాపోయారు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా కుల వివక్ష ఉన్న గ్రామాలను గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా నిర్వహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కళాకారుల చేత కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక క్యాంపేయన్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పెద్దాపురం అశోక్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి శివకుమార్ రాజు, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రవీణ్,దాస్,మల్లేష్ నాయకులు బాబురావు ప్రవీణ్ నర్సింలు గంగారం జయరాం అశోక్ శ్రీనివాస్ ప్రభు రాజేష్ దత్తు మైపాల్ తదితరులు పాల్గొన్నారు