
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ,సమాచార,ప్రజా సంబంధాలశాఖ,వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ,రవాణాశాఖ బిసి వెల్ఫేర్ మంత్రి పొన్నం.ప్రభాకర్ లకు మొదటిసారిగా వరంగల్ విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనాపూర్ ఇంచార్జ్ సింగపురం ఇందిరా,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ లు ఘనంగా స్వాగతం పలికారు.హనుమకొండ జిల్లా కరుణాపూర్ స్టేజ్ వద్ద ఇందిర,రాజేందర్ లు తన కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్,లకు ఘనంగా స్వాగతం పలికారు.కలెక్టర్ ఆర్.అండ్.బి అధికారి,ఇతర అధికారులు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వరంగల్ రీజినల్ రింగ్ రోడ్డు మ్యాప్ ని వివరించడం జరిగింది.అతి త్వరలో రింగ్ రోడ్డు కు సంబంధించి టెండర్లను పిలిచి పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ముఖ్య నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనాపూర్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నగరబోయిన.శ్రీరాములు, జెడ్పిటిసి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక.రవి, మాజీ జెడ్పిటిసి గుర్రం.యాదగిరి,చిల్పూర్ మండల అధ్యక్షులు గడ్డమీధి.సురేష్,ఎంపీటీసీ సింగపురం.దయాకర్,నస్కల్ ఎంపీటీసీ పాశం.శిరీష-సురేష్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.