
telugu galam news e69news local news daily news today news
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. ధర్నా అనంతరము హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి జిల్లా కమిటీగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కే అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివిలు ,ఆశ్రమ పాఠశాలు సంబంధించిన మెస్ బిల్లులు సమారు 6,300 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని విడుదల చేయలేదు, గత ప్రభుత్వంకు అనేక సందర్భాల్లో విడుదల చేయాలని కోరిన ఫలితం లేకుండా పోయింది. అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. వార్డెన్లు అప్పులు తీసుకుని వచ్చి హస్టల్స్ నడుపుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతిగృహాలకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించడం లేదు. అలాగే గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలో 7200కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల కాలేదు. అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 14 లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయాలని ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు నెంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిలు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని లేనియెడల హైదరాబాద్ జిల్లా కమిటీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమ్య, జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్,శ్రీమన్,సునీల్ ప్రశాంత్ స్టాలిన్,భావన, శివ ,గణేష్ ,రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు