
తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి,రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్
ఈ69న్యూస్ హనుమకొండ
తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి,రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ హనుమకొండకు శనివారం విచ్చేయగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మర్యాదపూర్వకంగా కలిశారు.హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాతీయ లోక్ అదాలత్,సామాజిక వర్గం మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు రాగా ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి స్వాగతం పలికారు.