రేగొండలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని గుడ్ లైఫ్ స్కూల్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్లూరి బాబురావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని బాబురావు ప్రారంభించారు.ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.రక్తదాన శిబిరంలో మండలంలోని సుమారు 50 మంది రక్తదానం చేశారు.భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్ సిబ్బంది రక్తదాన శిబిరంలో రక్తాన్ని సేకరించారు.స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని హిమ బిందు వైద్య శిబిరంలో సిబ్బందితో కలిసి సేవలందించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పుల్లూరి బాబురావు మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పూర్తి చేస్తున్నారని అన్నారు.నిరుపేదల కోసం నిరంతరం కష్టపడి పనిచేసే మనస్తత్వం వల్ల గండ్ర సత్యనారాయణరావు ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.నియోజకవర్గంలోని ప్రజల ఆశీస్సులు పొంది నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాల నరసయ్య,ఎన్ ఎస్ ఆర్ సంస్థల చైర్మన్ నాయినేని సంపత్ రావు, కోటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి, నాయకులు మేడం ఉమేష్ గౌడ్, పున్నం రవి, ఎర్రబెల్లి రవీందర్ రావు, పటేమ్ శంకరయ్య, బల్గురి రాజు, చిగురు మామిడి కుమారస్వామి, మటిక సంతోష్, పాతపెల్లి సంతోష్, పొనగంటి వీరబ్రహ్మం, మేకల రవికుమార్, బండారి దేవేందర్, మేకల బిక్షపతి, మైస బిక్షపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, కోలేపాక సాంబయ్య, బొజ్జం రవి, కోయిల క్రాంతి, గండి తిరుపతి,ముదురు కొల్ల తరుణ్, కొమర్రాజు భాస్కర్, పున్నం సాయి, మేకల శివ, చిలువేరు విష్ణు, పున్నం ప్రవీణ్ తది తరులు పాల్గొన్నారు.