ఫిజియోథెరపీ దివ్య ఔషధం-బిజెపి జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ ఫిజియోథెరపీ దివ్య ఔషధం లాంటిది అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి అన్నారు.ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన చిట్యాలకు వెళ్లే రహదారి లో నూతనంగా ఏర్పడిన ఆద్య ఆక్యుపంక్చర్ &చీరోప్రాక్ట్.. క్లినిక్ ను ముఖ్యఅతిథిగా ఎంపీపీ పున్నం రవి,ఏడునూతల నిషిధర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు.అనంతరం క్లినిక్ యజమాని డా.దాసరి మహేష్ కి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బిజీ జీవితంలో ఆరోగ్యం గా ఉండటం చాలా అవసరం అని,అందుకు ప్రజలు అందరూ తగు జాగర్తలు తీసుకోవాలని,అదే విధంగా ఆరోగ్యాభివృద్ధి కోసం ఆద్య ఆక్యుపంక్చర్ & చీరోప్రాక్ట్ క్లినిక్ లాంటి ఆరోగ్య కేంద్రాల అవసరం ఎంతో ఉందన్నారు.ఇక్కడి వారి ఆరోగ్యం కోసం ఈ క్లినిక్ ప్రారంభించిన మహేష్ నీ అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ ఉపసర్పంచ్ గండి తిరుపతి గౌడ్,పద్మశాలి సంఘం అధ్యక్షులు నామాల రమేష్,వెల్దండి అశోక్ తదితరులు పాల్గొన్నారు.