ఫలించనున్న రేగొండ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
ఎన్నో ఏళ్ల నుంచి బస్టాండు కోసం ఎదురుచూస్తున్న రేగొండ ప్రజల కల ఇన్నాళ్లకు నెరవేరపోతుంది.రేగొండ మండల కేంద్రం నుండి వందల సంఖ్యలో ప్రయాణికులు నిత్యం పరకాల,హనుమకొండ వరంగల్,టేకుమట్ల,చిట్యాల,భూపాలపల్లి ములుగు జిల్లాలకు ప్రయాణించే ప్రయాణీలకు బస్టాండ్ లేక ఎండలో నిలబడుతూ,వానలో తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూసే రోజులు త్వరలో ముగియనున్నాయి.రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.370 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు.రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారన్నారు. అదేవిధంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు.ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6,210 కోట్లు చెల్లించిందన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి,మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ చైర్మన్ రాష్ట్ర నాయకులు నాయనేని సంపత్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య,మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్,మేకల బిక్షపతి,గంగుల రమణారెడ్డి,మాజీ ఎంపిటిసి సుమలత బిక్షపతి పట్టెం శంకర్ రేగొండ మండల మహిళా మండలి అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద రాణి ,కాంగ్రెస్ పార్టీ రేగొండ టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి లింగాల గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకుల మల్లయ్య బుగులోని జాతర మాజీ చైర్మన్ రెంటాల వెంకటస్వామి తిరుమలగిరి గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్ రూపురెడ్డి పల్లె మాజీ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ జగ్గయ్యపేట సర్పంచ్ పాత పెళ్లి సంతోష్ మండల సీనియర్ నాయకుడు మటికే సంతోష్ ఉమ్మడి మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు పొనుగోటి వీర బ్రహ్మం గోరి కొత్తపల్లి మాజీ సర్పంచ్ సూదనబోయిన ఓం ప్రకాష్ , సత్తన్న యువసేన అధ్యక్షులు మోట్టే కిరణ్ పటేల్,సత్తన్న యువసేన నాయకులు సామల సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోయిల క్రాంతి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.