
రేపాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పల్లి రమణ వీరారెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంటరానితనం వివక్షతపై అలుపెరుగని పోరాటం చేసి,అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్పూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామ పెద్దలు యువకులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.