
ఈ69న్యూస్
వర్ధన్నపేట నియోజకవర్గంలోని అయినవోలు మండలం పున్నేల్ గ్రామంలో నివసించే శాంతాల సునీత భర్త మల్లేష్ అనారోగ్యంతో ఇటీవల మరణించాడు.కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో,తినేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సన్న బియ్యం ఆమె కుటుంబానికి ఆధారంగా నిలిచింది.పరామర్శకులుగా వచ్చిన పార్టీ ప్రతినిధులకు సునీత అదే సన్న బియ్యంతో భోజనం వండి పెట్టింది.“గత ప్రభుత్వంలో ఇచ్చే బియ్యం అమ్ముకునే పరిస్థితి,ఇప్పుడు రేవంతన్న ఇచ్చిన బియ్యం మా ఆకలి తీర్చింది.భర్త చనిపోయినప్పుడు ఇంట్లో ఒక్క రూపాయి లేదు,”అని ఆమె వేదనను వ్యక్తం చేసింది.ఈ విషయం ఎమ్మెల్యే నాగరాజుకు తెలియజేయగానే,ఆమె కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.ముగ్గురు ఆడపిల్లల చదువుకు పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య,గ్రామ పార్టీ నాయకులు ఇల్లందుల సారయ్య, ఎడ్ల రాములు,అంబేద్కర్ యూత్ నాయకులు పూర్ణ,రాజేష్ పాల్గొన్నారు.