
వరంగల్,హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు మరియు హనుమకొండ జిల్లా వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా ఋణ మార్పిడి-అవగాహన హనుమకొండ న్యాయ సేవాసదనంలో సదస్సును నిర్వహించడం జరిగింది.ఈ సదస్సులో వరంగల్,హనుమకొండ జిల్లాల కార్యదర్శులు ఎం.సాయి కుమార్,క్షమాదేశ్ పాండే మరియు హనుమకొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్,లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.శ్రీనివాస్,బ్యాంకు అధికారులు,వేర్వేరు రైతు సంఘాల అధ్యక్షులు మరియు రైతులు పాల్గొన్నారు.”ప్రైవేట్ వ్యక్తులు,సంస్థల నుంచి తీసుకున్న రుణభారం తగ్గాలంటే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని లబ్ధి పొందాలని సూచించారు.రైతులు తమ ప్రైవేట్ అప్పుల గురించి బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని,తద్వారా వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు ఇస్తారన్నారు.దీంతో పాత ప్రైవేట్ అప్పు లను పూర్తిగా తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు.బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును తక్కువ వడ్డీతో సులభ వాయిదాల్లో చెల్లించాలని పేర్కొన్నారు.”రైతులకు మేలు చేయడానికే బ్యాంకులు ప్రవేశపెట్టిన డెబ్ట్ స్వాపింగ్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా రైతులు,రైతు సంఘాల నాయకుల సందేహాలకు,వ్యవసాయ శాఖ మరియు బ్యాంక్ అధికారులు తగిన సూచనలు అందించారు.
