
రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో చేపట్టిన ధర్నా విజయ వంతం చెయ్యండి
రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది
పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది
ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
భూమి, వ్యవసాయం,
రైతుల కష్టాలు, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రేపు 30-11-2022 రోజున ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని రాష్ట్రం లో రైతుల పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు
సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు.
వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి.కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది.
ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని ఆయన అన్నారు
కావున కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులు ఎంపీటీసీలు సహకార సంఘం చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్,రసు పుత్ సీతారాం నాయక్,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంపాల ప్రభాకర్
ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా,మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్ళి శ్రీనివాస్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి శంకర్ మేస్త్రి, తదితరులు పాల్గొన్నారు