ఈ69 న్యూస్ రఘునాథ్ పల్లి : రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ పార్టీ జనగామ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న ఆరోపించారు.మండలంలోని కోడూరు గ్రామంలో బుధవారం దామెర అబ్బయ్య అధ్యక్షతన సిపిఐ మహాసభ జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న పాల్గొని మాట్లాడుతూ..కోడూరు గ్రామంలో సిసి రోడ్లు మురికి కాలువలు,వాటర్ ట్యాంక్ శిదిలావస్థకు చేరడమే కాకుండా, కరెంటు సరిగ్గా లేక గ్రామంలో తాగునీరు సరిగ్గా రాక ప్రజలు ఇబ్బందులు పడుతూన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పన పట్ల అధికారులు దృష్టి సారించాలని అయన కోరారు.గ్రామంలోని రైతులకు రైతుబంధు పూర్తిగా అమలు జరుగలేదన్నారు.రైతులు రైతుబంధు కొరకు వ్యవసాయ అధికారుల చుట్టూ,బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో,రైతులు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక రైతులు ఇబ్బందులకు గురవు తున్నారని అయన అన్నారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారించాలన్నారు.అనంత రం కోడూరు గ్రామంలో సిపిఐ పార్టీ నూతన కమిటీ వేయడం జరిగింది.సిపిఐ గ్రామ కార్యద ర్శిగా దామెర రాంచందర్,సహా య కార్యదర్శిగా జూకంటి రాంచం దర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కావటి యాదగిరి,పార్టీ నాయకులు గొరిగి సోమయ్య,మణికంఠ సోమయ్య,చిట్యాల రామచందర్,దాసరి కరుణాకర్,దాసరి రమేష్,కల్లపల్లి యాదగిరి,జూకంటి అంజయ్య,లచ్చమ్మ,ఎల్లమ్మ,తదితరులు పాల్గొన్నారు.
