
telugu galam news e69news local news daily news today news
పినపాక మండలం దేవనగరం నుండి మద్దులగూడెం గ్రామాల మధ్యలోని ప్రధాన రోడ్డు గత సంవత్సరం క్రితం కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రోడ్డుకు,కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ రాజ్ అధికారులను పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం పంచాయతీ రాజ్ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ లో అత్యవసర సమావేశమైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. వేగంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టి దేవరనగరం నుండి మద్దులగూడెం ఇబ్బందికరంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. రోడ్డుకు మరమ్మతులు చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.