mahabubad news local news telugu galam news e69news road accedent news
మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామ శివారు బోడతండకు చెందిన గ్రానైట్ లారీ డ్రైవర్ బోడ రమేష్ (38) సోమవారం రాత్రి తిరుమల పాలెం మండల కేంద్రంలో రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో రమేష్ మృతి చెందారు. రమేష్ ఖమ్మం ఓ గ్రానైట్ కంపెనీలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఉన్న బైక్ వచ్చే రమేష్ బైకులు బలంగా ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఖమ్మం హాస్పిటల్ కి తరలించగా రమేష్ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. తిరుమలయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.