
రోడ్డు మరమ్మత్తులు ప్రారంభించాలని కోరిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం మంథని రోడ్డు గుంతలుగా మారి చెరువులను తలపిస్తున్న వైనంపై మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆర్ అండ్ బి ఈ.ఎన్.సి హైదరాబాద్ వారిచే మాట్లాడి మరమ్మత్తు పనులు చేపట్టి వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బందులు కలవకుండా చూడాలని కోరారు. ఈరోజు కాటారం మండలంలో పర్యటించిన శ్రీధర్ బాబు గారు ఇసుక లారీల వల్ల రోడ్లు చెడిపోయి ప్రయాణికులు నరకయాతన పడుతుంటే కమిషన్లకు కక్కుర్తి పడ్డ అధికార పార్టీ నాయకులు రోడ్లను పట్టించుకోవడంలేదని అన్నారు . తరచూ రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వెలుబుచారు.వారితోపాటు కాటారం ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు స్థానిక నాయకులు ఉన్నారు