
శాయంపేట మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కింద ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టించక పోవడం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారి అసమర్థ పాలనకు నిదర్శనం అభివృద్ధి పేరుతో పార్టీ మారి నాలుగు సంవత్సరములు గడుస్తున్న ఇప్పటివరకు మండల కేంద్రంలో రోడ్లు పనులు పూర్తి చేయకపోవడం మండలంలో శిలాఫలకాలు వేసి ఏళ్ళు గడుస్తున్నా ఇల్లు లేని నిరుపేదకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించలేని మీ అసమర్ధతను ఏమని ప్రశ్నించాలి. ఒకపక్క గ్రామాలలో ప్రజలు గాని ప్రతిపక్ష పార్టీలు గాని ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా మండల కేంద్రంలో ఇల్లు కోల్పోయిన వారికి గాని ఇల్లు లేని నిరుపేదలకు గాని వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని శాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తుంది