
ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ డా .వినీత్ ఆదేశాల మేరకు
భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికంగా నివసించే పలువురు రౌడీ షీటర్లకు శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ పరితోష్ పంకజ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అసాం ఘిక కార్యకలాపాలు కొనసాగించేవారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సెలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగినవారి పై రౌడీషీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన వెల్లడించారు. వివిధ నేరాలలో రౌడీ షీట్లుగా ఉన్న వారు ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని, ఒకవేళ లా అండ్ ఆర్డర్ కు అంతరాయం ఏర్పడే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై పీ డీ యాక్ట్ లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమం లో టౌన్ సీఐ నాగరాజు రెడ్డి, టౌన్ ఎస్ఐ లు మధు ప్రసాద్, పీ వీ ఎన్ రావు పాల్గొన్నారు.