
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపెల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించడంజరిగినది. తీరు తీరు రకాల పువ్వులతో మరియు తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, పూవుల తో బతుకమ్మను అలంకరించి మహిళలు ఆటపాటలతో ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు. అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగగా జరుపుకుంటున్నారు.పల్లెకు కొత్త అందాన్ని తీసుకొచ్చే ఈ పూల పండుగ,మహిళలలు అందరూ కలిసి తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకరంగానిలుస్తోంది.ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకలో గ్రామ మహిళలు,బాలికలు,పిల్లలు,కుటుంబ సభ్యులు అందరూకలిసి పాల్గొని పాటలు పాడుతూ,ఆటలాడుతూ ఉత్సాహంగా ఆనందంగా.ప్రకృతిని ఆరాధిస్తూ,పూవులను పూజించే ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతనోత్సావం నింపాలని కోరుకుంటు ఎంతతో ముగించడం జరిగినది.