
దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మనూరు ఈశ్వర్
ఈ69 న్యూస్, పామిడి.
గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం కొత్తపేట గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానం మేరకు గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరామ్ తనయుడు,పామిడి మరియు గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి నూతన దేవాలయం ప్రారంభోత్సవం సందర్బంగా స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈకార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కొత్తపేట గ్రామ ప్రజల పాల్గొన్నారు.