
తల్లాడ స్థానిక తాసిల్దార్ కు తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక లక్ష రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు తాతా భాస్కరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతులను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించి ఇప్పటికీ అమలు కాకపోగా అప్పు రెట్టింపు అయిందని బ్యాంకులో అప్పులు ఉన్నందున కొత్త అప్పు ఇవ్వటం లేదని గత్యంతరం లేక రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి నష్టాల్లో కోరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రుణమాఫీ అయ్యేంతవరకు రైతులను సమీకరించి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సేలం సత్యనారాయణ రెడ్డి మండల కార్యదర్శి నల్లమౌతూ మోహన్ రావు అయినాల రామలింగేశ్వర రావు దూల జనార్ధన్ తాత తిలక్ షేక్ మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు