*హనుమకొండ జిల్లా...* 22.11.2022 మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి హనుమకొండ, వడ్డేపల్లి కనకదుర్గ కాలనీలోని కడియం శ్రీహరి గారి నివాసము నందు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పలు గ్రామాల *ముఖ్యమంత్రి సహాయ నిధి* *(ఎల్.ఓ.సి)* పత్రాల కింద 4,50,000 రూపాయలను లబ్దిదారులకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి నేడు అందించారు.*జఫర్ గడ్* మండల *తిడుగు* గ్రామానికి చెందిన చెలువోజు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడగా నిమ్స్ హాస్పటల్ లో శస్త్ర చికిత్స గురించి *2,00,000* రూపాయల ఎల్.ఓ.సి అందచేశారు.*వేలేరు* మండలకేంద్రం లోని , నర్రా వరుణ్ కి నిమ్స్ హాస్పటల్ లో శస్త్ర చికిత్స గురించి *2,50,000* రూపాయల ఎల్.ఓ.సి అందచేశారు.*అలాగే....* స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లోని ఇందిరా నగర్ వాసులు అభ్యర్థన మేరకు వారి కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమత్తులు మరియు స్థల మార్పిడి నిమిత్తం సి.డి.పి నిధుల నుండి మంజూరీ అయిన *4,09,386* ప్రొసీడింగ్ పత్రాలను నాయకులు, కాలనీ వాసులకు అందచేశారు._