
లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో వాసవి మాత
పామిడి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లో శుక్రవారం రోజు ఉత్సవ విగ్రహం లలిత త్రిపురసుందరి దేవి అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు. మూల విరాట్ 120చీరలు ఒడిబియ్యం మూటలతో మధ్యాహ్నం దర్శనం ఇచ్చారు.ఉదయం 108జల కళాశాల జలం తో అభిషేకం చేశారు.ఉదయం ఆర్యవైశ్య సంఘం వాసవి మాతృ మండలి సభ్యులు భోగేశ్వర స్వామి దేవాలయం కువెళ్లి మేళలతో పెన్ననది జలాలు తీసుకోచ్చారు. రాత్రి లలిత సహస్రనామపారాయణం పై పోటీ పెట్టి బహుమతులు అందించారు. కోత్తురు నెమిలి రంగయ్య భార్య సావిత్రమ్మ వారి శాశ్వత పూజ తో సహా 15మంది పూజలు చేయుంచగా కె.నాగరాజు అల్పాహార విందు అందించారు.