
**హనుమకొండ: ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి అన్నారు.పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఫిజికల్ టెస్టులో నిబంధనలు సడలించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు మల్టీ ప్రశ్నలకు సంబంధించిన హైకోర్టు ఆర్డర్‌ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని,తప్పుగా వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన మార్కులు అందరికీ కలపాలనీ,*లాంగ్ జంప్ కి సంబంధించి పురుషులకు 4mts to 3.8 mts , మహిళలకు 2.5mts to 2.2mts పాత పద్ధతిని తీసుకురావాలి*.షాట్ పుట్ కి సంబంధించి పురుషులకు 6మీ. నుండి 5.6 మీటర్లకు మరియు మహిళలకు సంబంధించి 4మీ. నుండి 3.75 మీటర్స్ కి కుదిరిస్తు పాత పద్ధతిలోనే తీసుకురావాలి,1600 మీటర్స్ రన్నింగ్ అనంతరం 2గంటలు లేదా ఒక రోజు సమయం ఇచ్చి లాంగ్ జంప్ లేదా షాట్ పుట్ నిర్వహించాలి.ఈవెంట్స్ కి సంబంధించి ఇంతకు ముందు నోటిఫికేషన్ లో ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధం లేని పోస్ట్ అయిన కమ్యూనికేషన్, పైర్ మెన్, సివిల్ విభాగాల్లో బెస్ట్ ఆఫ్ 2 ఈవెంట్స్ అమలు చేయాలి.ఎస్ ఐ, కానిస్టేబుల్ కి సంబంధించి వేరువేరుగా ఈవెంట్స్ ను నిర్వహించాలి,లాంగ్ జంప్ లో ఆన్ ది లైన్ జంప్ ని కూడా అనుమతించాలి, ఎత్తు కి సంబంధించిన డిజిటల్ విధానాన్ని తీసేసి, పాత మాన్యువల్ పద్ధతినే తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, అనీల్, మధు, సందీప్ సతీష్ ,చిరంజీవి పాల్గొన్నారు.