పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. గ్రేటర్ హైదరాబాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ లాండ్రీ వర్కర్స్ కమిటీ గా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన కార్యదర్శి గా ఎన్నికైన సందర్భంగా జాన్ వెస్లీ గారిని అపార్ట్మెంట్ వాచ్మెన్ లాండ్రీ వర్కర్స్ కమిటీ సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం జాన్ వెస్లీ గారు కమిటీ సభ్యులతో కూర్చొని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెస్లీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాచ్మెన్ లపై దాడులు, దౌర్జన్యాలు, వాచ్మెన్ స్త్రీలపై లైంగిక వేధింపులు, దొంగతనాలు పనికి తగ్గ వేతనం వంటి సమస్యలు ఉన్నాయని, అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ లాండ్రీ వర్కర్స్ కు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వర్తించే బెన్ఫిట్స్ ని వాచ్మెన్ లకు వర్తింపజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాన్ వెస్లీ గారిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి నరేష్, ఈదురి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భద్రయ్య, వెంకన్న, గాదె యాకయ్య, సహాయ కార్యదర్శులు తిమ్మిడి రవి, వెంకన్న, వెంకటేష్ తాటికొండ కుమార్ కమిటీ సభ్యులు చిన్న వెంకన్న తదితరులు కలిశారు.