జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని సిపిఐ పార్టీ ఘనంగా నిర్వహించింది.మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సిపిఐ మండల కార్యదర్శి రావుల సదానంద్,1886లో చికాగోలో ప్రారంభమైన కార్మిక ఉద్యమాన్ని స్మరించారు.కార్మికుల త్యాగాలతోనే 8 గంటల పని హక్కు సాధ్యమైందన్నారు.కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.