
లిక్కర్ పై ఉన్న ప్రేమ రైతుల సాగునీరుపై లేని ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ పై చూపుతున్న ప్రేమ రైతుల సాగునీరు పై ఎందుకు సూచడం లేదు మూడు నెలలు ముందుగానే వైన్ షాప్ టెండర్లను వేశారు కానీ కాలం నెత్తి మీదకు వచ్చిన సాగునీరు మాత్రం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.శుక్రవారం 20వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం ముకుందాపురం ఆకుపాముల కోదండ రామాపురం నరసింహపురం కృష్ణాపురం గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ పై ఉన్న ప్రేమ రైతులకు సాగునీరు అందించడంలో లేదని ఆయన ఎద్దేవ చేశారు. గత తొమ్మిది సంవత్సరాల పాలనలో రైతులను ఎన్నో రకాలుగా మోసం చేసుకుంటూ వస్తున్న కెసిఆర్ ఇప్పుడు కూడా తన బుద్ధిని చూపించాడని అన్నారు. రైతులకు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి రుణమాఫీ చేస్తున్నట్లే చేసి కానీ వడ్డీని మాత్రం రైతులే కట్టాలని చెప్పిన కెసిఆర్ రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. గతంలో రైతుబంధు పేరుతో రైతులకు అందించే సబ్సిడీలు అన్ని తీసేయడం వలన రైతుబంధు డబ్బులు విత్తనాలకు ఎరువులకు రైతు సామాగ్రిలకు మించి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతున్నాయని అన్నారు.ఎడమ కాలువ సాగినీరు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కాలం నెత్తి మీదకు వచ్చిన ఇంతవరకు నీరు అందించకపోవడం వలన రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ప్రజలు రాజకీయాలలో కొత్తదనాన్ని యువతను కోరుకుంటున్నాను అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,మట్టయ్య యాదవ్,రవి,కోటయ్య,రాముడు,శివ,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న,చంద్రకళ,గౌతమి,కళావతి మాలోవత్ బాలు,అయ్యప్ప, అప్పారావు,ఎలుగూరి సైదులు గౌడ్ బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.