
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్ శీతానగరం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం..మండలం వంగళపూడి గ్రామ అహ్మదీయ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షునిగా షేక్ నబీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జాతీయ యూత్ అధ్యక్షులు షమీం గోరి సాహెబ్ వారి ఎన్నికను ఆమోదించగా ఆదివారం స్థానిక అహ్మదీయ ముస్లిం కమిటీ అధ్యక్షులు షేక్ ఖాసిం ఫారూఖ్ సాహెబ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా యూత్ అధ్యక్షునిగా నియామకమైన నబీ మాట్లాడుతూ..తన పై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి నందుకు మరియు తమ నియామకానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.యువకుల సంస్కరణకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ మొహమ్మద్ సిరాజ్ సాహెబ్.స్థానిక వయోజన అధ్యక్షులు షేక్ అహ్మద్ అలీ ఉద్దీన్.స్థానిక మౌల్వీ ముహమ్మద్ అక్బర్.కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు షేక్ షేక్ మస్తాన్ గాంధీ షేక్ షారుక్ షేక్ దాదాసాహెబ్ షేక్ బాబు సాహెబ్ షేక్ బాలు ఫరూక్ షేక్ లతీఫ్ షేక్ నాగూర్ మహిఉద్దీన్ షేక్ షాబుద్దీన్ షేక్ మస్తాన్ పోషిక్ షేక్ గన్షా అజారా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.