
telugu galam news e69news local news daily news today news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆకస్మికంగా పర్యటించారు.ఈ సందర్భంగా ప్రజా పాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సర్వే చేయు విషయంపై ఆకస్మిక పరిశీలన చేశారు.ఈ సర్వేలో వంట గ్యాస్ సబ్సిడీ కొరకు కన్జుమర్ నంబర్ల సర్వే వేగంగా పూర్తి చేయాలని అధికారులను సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం తహశీల్దార్ కార్యాలయాని సందర్శించి సాధారణ ఓటర్ల జాబితా నందలి డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగించాలని మరియు ఎమ్మెల్సీ ఓటు కోసం వచ్చిన అన్ని దరఖాస్తులను విచారణ చేసి ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియ వేగ వంతం చేయాలని సూచనలు జారీ చేసినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జనగామ(స్థానిక సంస్థలు)ఆర్డీవో ఘనపూర్ తాసిల్దార్ మరియు డిప్యూటీ తాసిల్దార్ ఘన్పూర్ తదితర అధికారులు పాల్గొన్నారు.